Monday, July 22, 2024

హీరో దర్శన్ ఫామ్‌హౌస్ మేనేజర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : రేణుకా స్వామి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు, హీరో దర్శన్ ఫామ్‌హౌస్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మృతదేహాన్ని మంగళవారంనాడు ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన ఓ లేఖతో పాటు వీడియో సందేశాన్ని కనుగొన్నారు.

అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తన బంధువులకు, స్నేహితులకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలో స్పష్టం చేశాడు. ఒంటరితనం కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్న నోట్‌లో శ్రీధర్ పేర్కొన్నాడు. అయితే రేణుకా స్వామి హత్య, దర్శన్ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే శ్రీధర్ ఆత్మహత్యకు ఒడిగట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబందం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News