Thursday, May 1, 2025

‘సలార్’లో లాగా ‘హిట్ 3’లో యాక్షన్ ఉంటుంది

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ ః ది థర్డ్ కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ మూవీ గురువారం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

రెగ్యులర్ సినిమాల ఉండదు…
హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. హిట్ 3 సినిమాకు వచ్చేసరికి యాక్షన్, వయోలెన్స్ కథ డిమాండ్‌ని బట్టి వచ్చింది. ఇది రెగ్యులర్ సినిమాల ఉండదు. కథలో ఆర్గానిక్‌గా వయోలెన్స్ ఉంది. అది సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది.
టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది…
అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ జోనర్ సినిమా. టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పిస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుంది.
యాక్షన్ అలానే ఉంటుంది…
సలార్ సినిమాలో యాక్షన్ చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు. ఇందులో యాక్షన్ అలానే ఉంటుంది. అయితే కేసు తాలూకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా వయోలెన్స్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాంటి వయోలెన్సే ఉంటుంది.
బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే…
ఇది మంచి థియేటర్ అనుభూతినిచ్చే సినిమా. ఇందులో విభిన్న భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
కామెడీ స్క్రిప్ట్ రాయమని చెబుతుంటా..
దర్శకుడు శైలేష్ ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు కానీ తను చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మనిషి. తనకి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెబుతుంటాను. తను కామెడీ రాస్తే చాలా బ్రహ్మాండంగా వుంటుంది.
రెండు దేనికవే ప్రత్యేకమైనవి…
హిట్ 3, పారడైజ్ రెండు దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. పారడైజ్ ఒక ఎపిక్ స్కేల్‌లో ఉంటుంది. హిట్ 3 ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News