హైదరాబాద్: హీరో నిఖిల్ (Hero Nikhil) సినిమా విడుదలైన చాలా కాలమే అయింది. ప్రస్తుతం అతను ‘ది ఇండియన్ హౌస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రమాం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై హిరో నిఖిల్ స్పందించారు. ‘‘ప్రేక్షకులకు గొప్ప సినిమా అనుభూతిని అందించేందుకు కొన్నిసార్లు రిస్క్ తప్పవు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ, కొన్ని ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు’’ అని నిఖిల్ (Hero Nikhil) పేర్కొన్నారు.
శంషాబాద్ సమీపంలోని ‘ది ఇండియా హౌస్’ చిత్రం సెట్లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రం సీన్స్ తీసేందుకు పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఆ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా సెట్స్‌లోకి భారీగా నీళ్లు వచ్చాయి. దీంతో పలువురు సిబ్బందికి గాయాలు కాగా.. వారికి ప్రాథమిక చికిత్స అందించారు.