Saturday, February 4, 2023

అమ్రాబాద్ అడవులలో హెటిరో చిరుత

- Advertisement -

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పారిశ్రామికవాడలోని హెటిరో కంపెనీలో పట్టుపడిన చిరుతను అటవీశాఖ అధికారులు అమ్రాబాద్ అభయారణ్యంలో వదిలిపెట్టారు. ఈ నెల 17వ తేదీన హెటిరో కంపెనీలోకి చిరుత ప్రవేశించగా.. అటవీశాఖ అధికారులు ప్రత్యేక గన్‌తో మత్తుమందు ఇచ్చి…హెటిరో డ్రగ్స్ ప్లాంట్ నుంచి జూ పార్క్ కు తరలించారు. పట్టుకున్న చిరుతను శుక్రవారం అమ్రాబాద్ అభయారణ్యంలోని మన్ననూరు రేంజ్ లో సురక్షితంగా అటవీశాఖ సిబ్బంది వదిలిపెట్టారు. జూపార్కులో మూడు రోజుల పరిశీలన తర్వాత అటవీ ప్రాంతంలో చిరుతను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles