Tuesday, September 17, 2024

హైదరాబాద్‌లో హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

పంద్రాగస్టు నేపథ్యంలో భాగ్యనగరంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి నిఘా పెట్టారు. ప్రధాన ప్రాంతాలతో పాటు సమస్యాత్మక ఏరియాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలలో ఆయా కమిషనర్ల ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో పోలీసులు ముందస్తుగా తనిఖీలు ముమ్మరం చేశారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్న నేపథ్యంలో గోల్కొండ ప్రాంతంతో పాటు అటువైపుగా వెళ్లే దారుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా సోదాలు నిర్వహిస్తున్నారు.

నగరంలోని అన్ని ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు గతంలో ఎన్నడూలేనివిధంగా పోలీసులను మోహరించి….ప్రతి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశారు. పోలీసు బలగాలతో పాటు సుమారు రెండువేల మంది ప్రత్యేక దళాలతో నగరాన్ని జల్లెడ పడుతున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సిసి కెమెరాలలో నిక్షిప్తమైన చిత్రాలతో పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైన అనుమానాస్పదంగా సంచరించినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జిలు,ఫ్లై ఓవర్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News