Sunday, September 15, 2024

డికె శివకుమార్‌పై సిబిఐ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై అక్రమాస్తుల కేసు(డిఎ) కేసు దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించు కోవాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చూస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు గురువారం కొట్టివేసింది. డికె శివకుమార్‌పై నమోదైన రూ. 74.93 కోట్ల అక్రమాస్తుల కేసు దర్యాప్తును లోకాయుక్తకు నివేదిస్తూ 2023 డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కె సోమశేఖర్, జస్టిస్ ఉమేష్ ఎం ఆదిగలతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని తన 67 పేజీల తీర్పులో డివిజన్ బెంచ్ తెలిపింది. ఈ కేసుపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును ఆగస్టు 12న రిజర్వ్ చేసింది. కాగా..2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మత్రిగా పనిచేసిన డికె శివకుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సిబిఐ ఆరోపించడంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి సిబిఐకి అనుమతి ఇచ్చింది. కాగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో సిబిఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News