Tuesday, April 30, 2024

హిజాబ్ వివాదం.. ఇరాన్ పోలీసుల దాడిలో 16ఏళ్ల బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

Hijab Issue: Iran girl dies after police beaten

హిజాబ్ వివాదం.. ఇరాన్ పోలీసుల దాడిలో 16 ఏళ్ల బాలిక మృతి
ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించనందుకు ఫలితం
టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిన్ అనే యువతి పోలీస్ కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలై పోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టడం వల్లనే మృతి చెందినట్టు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అద్దాబిల్ లోని షహేద్ గర్ల్‌హైస్కూల్‌లో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు విద్యార్థులు నిరాకరించారు. దీంతో విద్యార్థులపై విచక్షణా రహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు ద గార్డియన్ పేర్కొంది.

ఈ దాడి లోనే గాయపడిన 16 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. అయితే భద్రతా దళాలు కొట్టడం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమం లోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు తోనే ఆ బాలిక మృతి చెందిందని ఆ బాలిక బంధువు ఒకరు తెల్పడం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్, సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో ఏడుగురు గాయపడినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా బలగాల దాడిలో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.

Hijab Issue: Iran girl dies after police beaten

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News