Saturday, August 16, 2025

శ్రీకృష్ణుడిని యుద్ధవీరుడిగా చూపించే సినిమా

- Advertisement -
- Advertisement -

అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ (Shri Krishna inAvatar Mahoba) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ వ్యాస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుండగా, ముకుంద్ పాండే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఇస్కాన్ ఢిల్లీకి చెందిన జితామిత్ర ప్రభు శ్రీ ఆశీస్సులతో ఈ నవ్య కావ్యం రూపొందుతోంది. ఇది 11-,12వ శతాబ్దాల నాటి ’మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని (Spiritual influence) చూపించబోతుంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది. ’శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ ఒక పాన్ -వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News