నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’. ఇందులో కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించిన ఈ సినిమా రేపు(మే 1న) తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ టికెట్ ధరలు పెంచారు. చిత్రయూనిట్ విజ్ఞప్తి మేరకు ఎపి ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల వరకు మాత్రమే పెరిగి ధరలు అమల్లో ఉంటాయి. ఇక, తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వమని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఘటన నేపథ్యలో ఈ నిర్ణయం తీసుకుంది.