Sunday, September 15, 2024

ఈ వారంలోనే జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు : సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ వారంలోనే ఇళ్లస్థలాలను అప్పగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల పరస్పర సహకార సంఘానికి ఈ వారంలోనే పేట్ బషీర్‌బాద్ స్థలాన్ని స్వాధీనం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 28న జరగాల్సిన కార్యక్రమం సంబంధిత సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

చిట్‌చాట్‌లో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, వాటిలోని ఒక్కో అంశాన్ని సరిదిద్దుతూ వస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే జర్నలిస్టులకు జరిగిన అన్యాయాన్ని కూడా సవరిస్తున్నామని చెప్పారు. ఈవారంలోనే జెఎన్‌జె సొసైటీకి పేట్ బషీర్‌బాద్ స్థలం స్వాధీనం చేస్తూ తన చేతుల మీదుగా మెమో ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News