- Advertisement -
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఇప్పుడు సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి పని చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ “హోంబలే ఫిలిమ్స్‌లో మేము స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. హృతిక్ రోషన్‌తో ఓ గొప్ప సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలన్న లక్ష్యాన్ని సాకారం చేస్తాం. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలా వుంటుంది” అని చెప్పారు. హృతిక్ రోషన్ మాట్లాడుతూ “హోంబలే ఫిలిమ్స్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. మేము పెద్దగా కలలు కంటున్నాం. ఆ కలల్ని నిజం చేసేందుకు పూర్తిగా అంకితభావంతో ఉన్నాం”అని అన్నారు.
- Advertisement -