Monday, December 2, 2024

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదగిరిగుట్టకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఇక, కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News