Saturday, April 27, 2024

శబరిమల ఆలయానికి భారీగా భక్తులు..

- Advertisement -
- Advertisement -

శబరిమల ఆలయానికి భారీగా భక్తుల రాక
భక్తుల పరిమితిని ఎత్తివేయడంతో పెరిగిన ఆదాయం
10 రోజులు… రూ.52 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో రానిచ్చిన ట్రావెన్‌కోర్ బోర్డు ఈ సంవత్సరం భక్తుల పరిమితిని ఎత్తివేయడంతో భక్తులు భారీగా వస్తున్నారు. ప్రస్తుతం భక్తులు భారీగా రావడంతో 10 రోజుల ఆదాయం సుమారు రూ.52 కోట్లు వచ్చినట్టు ట్రావెన్‌కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్ల ఆదాయం రాగా అరవణ విక్రయం ద్వారా రూ.23.57 కోట్లు, దేవస్థానం హుండీల ద్వారా సుమారుగా రూ.12.73 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

గతేడాది నవంబర్‌లో రూ.9.92 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని, ఈసారి మాత్రం పెరిగిందని ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఆదాయం తగ్గిందన్నారు. వచ్చిన ఆదాయాన్ని ఉత్సవాల నిర్వహణకే ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే నాలుగు మార్గాలను తెరిచే ఉంచామని, భక్తులు వారికి ఇష్టమైన మార్గంలో రావొచ్చని ఆయన సూచించారు. శబరిమలకు వచ్చే భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దర్శనం టికెట్‌లను పొందవచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News