కాబూల్: భారత్ పొరుగు దేశం అఫ్ఘానిస్థాన్‌లో (Afghanistan) భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం రిక్టార్ స్కేల్‌పై 6.0 తీవ్రతగా నమోదైంది. ఈ ప్రకృతి ప్రకోపానికి 250 మందికిపైగా మృతి చెందగా.. 500 మంది వరకూ గాయపడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం 8 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్థరాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఆ తర్వాత వరుసగా మరో నాలుగు సార్లు భూకంపం సంభవించింది. 1.08 గంటల నుంచి ఉదయం 5.16 గంటల సమయంలో ఇక్కడ భూమి కంపించినట్లు సమాచారం. అయితే అఫ్ఘానిస్థాన్ (Afghanistan) అధికారులు మాత్రం 20 మందే ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెబుతున్నారు. కానీ, యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులుక అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read : శత్రుత్వం వద్దు..డ్రాగన్-ఏనుగు ఏకమవ్వాలి