Tuesday, February 7, 2023

రాంగోపాల్ పేటలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

హైదరాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం పై అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు క్రేన్ ను తెప్పించారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles