Wednesday, October 9, 2024

పెద్ద అంబర్‌పేట్‌ లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. పెద్ద అంబర్‌పేట్‌ ప్రాంతంలో ఎక్సైజ్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నామని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఖురేషి చెప్పారు. నిందితుల నుంచి 170 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు.

గంజాయి తరలిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశామని.. నిందితులు అందరూ మహారాష్ట్రలోని ఒకే గ్రామానికి చెందిన వారని చెప్పారు. వీరు గంజాయి సరఫరా చేయడానికి వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకుని దందా చేస్తున్నరని తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ మార్కెట్ లో రూ.34 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News