Friday, January 27, 2023

వన్ డే మ్యాచ్ కు భారీ బందోబస్తు

- Advertisement -

నేడు ఉప్పల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. . మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీంను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్‌ అనుమతి లేదని తేల్చి చెప్పారు.

ఈసారి క్విక్ రియాక్షన్ టీమ్స్‌ను పోలీసులు రంగంలోకి దింపునున్నామన్నారు. ల్యాప్‌టాప్‌, నీళ్ల సీసాలు, కెమెరాలు, సిగరెట్టు, అగ్గిపెట్టె, లైటర్‌, నాణేలు, పెన్నులు, హెల్మెట్‌, బ్యాగులు, బయటి తినుబండారాను అనుమతించబోమని తెలిపారు. మ్యాచ్ 1.30కి ప్రారంభం అవుతుందని, 10.30 నుండి లోపలికి అనుమతిస్తామని తెలిపారు. స్టేడియం పరిసర ప్రాంతాు, స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే చోట, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కలిసి మొత్తం 300 సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles