Wednesday, April 24, 2024

ఫ్లోరిడాను తాకిన హరికేన్ ఇయన్

- Advertisement -
- Advertisement -

Hurricane

ఫ్లోరిడా: అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఇయన్’ హరికేన్ ప్రచండ వేగంతో అమెరికా తీరాన్ని తాకింది. ఫ్లోరిడా వద్ద అమెరికా భూభాగంపై ప్రవేశించిన ‘ఇయన్’ విలయం సృష్టించింది. హరికేన్ ఇయాన్ బుధవారం స్థానిక కాలమానం ప్రకారం దాదాపు 15:10 (19:10 జిఎంటి) సమయంలో తీరాన్ని తాకింది, గంటకు 241కిమీ. (150మైళ్ల) వేగంతో గాలులు వీచాయి. దీంతో నాటకీయ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.  ఆసుపత్రి పైకప్పు ఎగిరిపోవడం, కార్లు మునిగిపోవడం,  చెట్లు కూలడం వంటివి జరిగాయి. నాలుగో కేటగిరీ హరికేన్ తరువాత ఉష్ణమండల తుఫానుగా తగ్గించబడింది(డౌన్ గ్రేడెడ్). అధ్యక్షుడు జో బైడెన్ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ నుండి గురువారం బ్రీఫింగ్ అందుకుంటారు. సముద్రంలో ఉండాల్సిన రాకాసి సొరచేపలు వీధుల్లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ దర్శనమిచ్చాయి.

Sharks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News