Wednesday, October 9, 2024

హైదరాబాద్ టీమ్‌కు రూ.25 లక్షల నజరానా

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ క్రికెట్‌కు టీమ్ భారీ నగదు బహుమతి లభించింది. శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ టీమ్‌కు ఘన సన్మానం జరిగింది. బుచ్చి బాబు ట్రోఫీని సొంతం చేసుకున్న హైదరాబాద్ టీమ్‌కు హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ టీమ్ ఓ మెగా టోర్నమెంట్‌లో ట్రోఫీని సాధించడం సంతోహంగా ఉందన్నారు. గత రంజీ సీజన్‌లో ప్లేట్ ఛాంపియన్‌గా నిలిచాం. ఈ సీజన్‌లో రంజీ ఎలైట్ ట్రోఫీ విజేతగా నిలువడమే లక్షంగా పెట్టుకున్నామని వివరించారు.

క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు హెచ్‌సిఎ సిద్ధంగా ఉందన్నారు. గట్టి పోటీ ఉండే ఆలిండియా బుచ్చిబాబు ట్రోఫీలో విజేతగా నిలువడం చాలా గర్వంతో కూడుకున్న అంశమన్నారు. జట్టు విజయానికి కృషి చేసిన ప్రతి ఆటగాడిని ఆయన ప్రశంసించారు. రానున్న రోజుల్లో కూడా జట్టు ఇలాంటి విజయాలే సాధించాలని జగన్‌మోహన్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సిఎ కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News