- Advertisement -
చందానగర్: చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను చందానగర్ (Hyderabad Chandanagar) పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద రెక్కీ నిర్వహించి పిల్లలను ముఠా కిడ్నాప్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈనెల 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రమేష్(1) అనే బాలుడు మిస్సింగ్ కేసుతో విషయం వెలుగులోకి వచ్చింది. సిసిటివి కెమెరాల ఆధారంగా నిందితుడిని చందానగర్ పోలీసులు గుర్తించారు.
నిందితున్ని విచారించగా తనతో పాటు మరో ముగ్గురు ఉన్నట్టు నిందితుడు తెలిపాడు. నలుగురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లుగా నిర్ధారణ జరిగింది. ఐదేళ్లుగా పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ముఠాను అదుపులోకి తీసుకొని నలుగురు చిన్నారులను పోలీసులు కాపాడారు.
Also Read : ఢిల్లీలో భార్య, అత్తను కత్తెరతో చంపేసిన వ్యక్తి
- Advertisement -