Tuesday, February 7, 2023

హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా ఉంది : మంత్రి కెటిఆర్

- Advertisement -

ఇండియాలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ర్టమని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం అమెజాన్ ఎయిర్ కార్గో ప్రైమ్ ఎయిర్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమెజాన్ వరల్డ్ లార్జెస్ట్ క్యాంప్ హైదరాబాద్ లో ఉన్నందుకు గర్వంగా ఉందని, గత కొన్నెళ్లుగా హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా ఉందని కెటిఆర్ అన్నారు.

హైదరాబాద్ గ్రీన్ సిటీ అవార్డును సొంతం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణకు సెకండ్ ర్యాంక్ వచ్చిందని వివరించారు. ఐటి సెక్టార్ లో తెలంగాణ అతివేగంగా అభివృద్ధి చెందుతుందని, ఏమియేషన్ రంగంలో కూడా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుంతని మంత్రి అన్నారు. అమెజాన్ ఎయిర్ కార్గో ప్రారంభించడం ఏవియేషన్ రంగంలో మరో అద్భుతమని, అమెజాన్ ఎయిర్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles