Sunday, April 28, 2024

సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి దినోత్సవం

- Advertisement -
- Advertisement -

అధికారికంగా నిర్వహించనున్న కేంద్రం
గెజిట్ నోటిఫికేషన్ జారీ

న్యూఢిల్లీ: ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినోత్సవం’గా జరుపుతామని కేంద్రం మంగళవారం ప్రకటించింది.1947 ఆగసు 15న భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత కూడా 13 నెలల దాకా హైదరాబాద్‌కు స్వాతంత్య్రం లభించలేదని, నిజాంల పాలనలో ఉండిందని ఒక నోటిఫికేషన్‌లో కేంద్ర హోం శాఖ తెలిపింది. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో పోలీసు చర్య తర్వాత 1948 సెప్టెంబర్ 18న అది విముక్తి పొందింది.

‘సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా జరపాలన్న డిమాండ్ ఆ ప్రాంత ప్రజలనుంచి చాలా కాలంగా ఉంది. హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను గుర్తు చేసుకోవడం కోసం, అలాగే యువతలో దేశభక్తిని రగిలించడం కోసం ప్రతి ఏడాది సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’ అని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. హైదరాబాద్ విముక్తి దినోత్సవానికి గుర్తుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఏటా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News