Saturday, October 12, 2024

హైదరాబాద్ నుండి బ్యాంకాక్‌కు ఎయిర్‌ఏషియా డైరెక్ట్ సర్వీసులు

- Advertisement -
- Advertisement -

ఎయిర్ ఏషియా థాయిలాండ్ హైదరాబాద్ నుండి బ్యాంకాక్‌తో పాటు చెన్నై నుండి ఫుకెట్‌కు ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రవేశపెట్టింది. దీంతో భారతదేశంలో విమాన సంస్థ తన విస్తరణను కొనసాగిస్తోంది. ఈ కొత్త విమాన సేవలు అక్టోబర్ 27న హైదరాబాద్ మార్గం కోసం, అక్టోబర్ 30న చెన్నై మార్గానికి టేకాఫ్ కానున్నాయి. తద్వారా భారతదేశంలోని రెండు ముఖ్య నగరాల నుండి ప్రయాణికులు నేరుగా థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్ – బ్యాంకాక్ మార్గంలో వారానికి 4 విమానాలు, చెన్నై-ఫుకెట్ మార్గం లో వారానికి 3 విమానాలు నడుస్తాయి. ఈ ప్రారంభం పురస్కరించుకుని ఎయిర్‌ఏషియా హైదరాబాద్ నుండి బ్యాంకాక్‌కి ప్రమోషనల్ చార్జీలను కేవలం రూ. 7,390 ఆల్- ఇన్-ఒన్- వే నుండి అందిస్తోంది.

2024 అక్టోబర్ 27 నుండి 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి 2024 సెప్టెంబర్ 22 వరకు బుక్ చేసుకోవడానికి ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌ఏషియా మూవ్ యాప్ (గతంలో ఎయిర్‌ఏషియా సూపర్ యాప్ అని పిలిచే వారు) లేదా ఎయిర్‌ఆసియా.కామ్‌లో ఇప్పుడే మీ సీట్లను పొందవచ్చు. థాయ్ ఎయిర్‌ఏషియా హెడ్ అఫ్ కమర్షియల్ తన్సితా అక్రరిత్‌పిరోమ్ మాట్లాడుతూ, ఎయిర్‌ఆసియా భారత్‌లో ఈ రెండు కొత్త మార్గాలతో పాటు 14 మార్గాలకు తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోందని అన్నారు. ఈ రెండు నగరాలూ దక్షిణ భారతదేశంలో వ్యూహాత్మక నగరాలుగా నిలవటం తో పాటుగా రెండు దేశాలకు అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని సైతం కలిగి ఉన్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News