Thursday, May 15, 2025

భారత్‌లో యాపిల్‌ కంపెనీలు పెట్టొద్దు.. ట్రంప్ సంచలన కామెంట్స్

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యాపిల్‌ కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇండియాలో యాపిల్ కంపెనీ నిర్మాణాలు నిలిపివేయాలని సీఈఓ టిమ్ కుక్‌ను కోరినట్లు డొనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. వాషింగ్టన్ భారత్‌తో విస్తృత వాణిజ్య సంబంధాల గురించి చర్చిస్తూ ఈ ప్రకటన చేశారు.

ఇండియాలో అత్యధిక టారిఫ్ ఉంటుందని.. కాబట్టి, అక్కడ యాపిల్ ప్రాడక్ట్స్ ఉత్పత్తి చేయొద్దని సీఈవో టిమ్ కుక్‌కి చెప్పినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ లో నిర్మించడం తమకు ఇష్టం లేదని.. అమెరికాలోనే యాపిల్‌ కంపెనీలు పెట్టాలని కోరినట్లు ట్రంప్‌ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News