Friday, December 6, 2024

కుటుంబ సర్వేను తనిఖీ చేసిన ఐఎఎస్ మయాంక్ మిట్టల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శేరిలింగంపల్లి పరిధిలో కుటుంబ సర్వేను ఐఎఎస్ మయాంక్ మీట్టల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందనగర్ సర్కిల్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల వారిగా వివరాలు సేకరించేందుకు సూపర్ వైజర్లు, ఎన్యుమరేటరు తమకు కేటాయించిన బ్లాక్ లలో సర్వే నిర్వహించాలని సూచించారు. కుటుంబ సర్వేలో భాగంగా ప్రజల సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ కులాల వివరాలు జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకాలలో సూచించిన ప్రకారం పొరపాటు లేకుండా నమోదు చేయాలని ఎన్యుమేటర్లకు మీట్టల్ ఆదేశించారు. శేరిలింగంపల్లిలో నాలుగు వార్డుల ఇంఛార్జీలు, సూపర్ వైజర్లు, 10 శాతం న్యూమరేటర్ల నమోదును క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎన్యుమరేటర్లను తరుపు మార్గదర్శకత్వం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి మిట్టల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News