Sunday, September 15, 2024

టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు నడుం బిగించిన ఐసిసి!

- Advertisement -
- Advertisement -

దుబాయి: సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నడుంబిగించింది. పొట్టి క్రికెట్ (టి20 ఫార్మాట్) రాకతో టెస్టులతో పాటు వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిన సంగతి తెలిసిందే. రానురాను ఈ ఫార్మాట్‌లకు ఆదరణ తగ్గుతోంది. వన్డేలపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇక సుదీర్ఘంగా సాగే టెస్టు క్రికెట్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫార్మాట్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. టెస్టులను ఆడేందుకు క్రికెటర్లు ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. చాలా మంది యువ ఆటగాళ్లు టెస్టులు, వన్డేలపై ఆసక్తి చూపడం లేదు. ఇక టి20లో ఆడేందుకు టెస్టులు, వన్డేలకు చాలా ముందుగానే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. పొట్టి క్రికెట్‌లో ఆడడం వల్ల పేరుతో పాటు కోట్లాది రూపాయల పారితోషికం లభిస్తోంది.

ఇలాంటి స్థితిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు టి20 లీగ్‌లపై దృష్టి సారిస్తున్నారు. భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. యువ ఆటగాళ్లకు టి20 ఫార్మాట్‌పై ఉన్న ఆసక్తి టెస్టులపై లేక పోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. చాలా మంది యువ క్రికెటర్లు వన్డేలు, టెస్టులను ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కేవలం టి20లలో ఆడేందుకు మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్క ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో తప్పిస్తే భారత్‌తో చాలా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐసిసి వన్డేలతో పాటు టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

ఇందు కోసం క్రికెటర్లకు టెస్టు క్రికెట్‌లో లభించే ఫీజులను భారీగా పెంచాలని భావిస్తోంది. దీని కోసం ఆయా క్రికెట్ బోర్డుల అభిప్రాయాలను తెలుసుకొంటోంది. బిసిసిఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులను మినహాయించి ఇతర దేశాల బోర్డులతో ఈ విషయంలో చర్చించాలనే ఆలోచనలో ఐసిసి ఉంది. టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. పెద్ద దేశాల మధ్య వరుస క్రమంలో టెస్టు సిరీస్‌లను నిర్వహించడమే కాకుండా ఈ ఫార్మాట్‌లో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావలనే ఉద్దేశంతో ఐసిసి ఉంది. టెస్టు మ్యాచ్ ఆడే క్రికెటర్లకు ప్రస్తుతం ఇస్తున్న ఫీజును భారీ మొత్తంలో పెంచాలని ఐసిసి భావిస్తోంది. దీనికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు పటిష్ఠమైన ప్రణాళికలను ఐసిసి సిద్ధం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News