Thursday, October 10, 2024

అక్టోబర్ 3 నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులను మరో మెగా టోర్నమెంట్ కనువిందు చేయనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌నకు అక్టోబర్ 3న తెరలేవనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లకు చోటు దక్కింది.

యుఎఇలోని షార్జా, దుబాయి వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది. నిజానికి ఈ వరల్డ్‌కప్ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ, బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో వరల్డ్‌కప్‌ను యుఎఇకి మార్చాల్సి వచ్చింది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 3న ప్రారంభమయ్యే లీగ్ దశ మ్యాచ్‌లు 15న ముగుస్తాయి. ఇక అక్టోబర్ 17న దుబాయి వేదికగా తొలి సెమీఫైనల్ పోరు జరుగుతుంది. రెండో సెమీఫైనల్ 18న షార్జాలో జరుగనుంది. ఫైనల్ సమరం అక్టోబర్ 20న దుబాయి వేదికగా జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News