Sunday, August 17, 2025

నేటి నుంచి ఐసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్‌లో గురువారం వరకు 16,716 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. శుక్రవారం(ఆగస్టు 8) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుండగా,ఈ నెల 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 245 కాలేజీల్లో 22,843 ఎంబిఎ సీట్లు అందుబాటులో ఉండగా, 47 కాలేజీల్లో 3,042 ఎంసిఎ సీట్లు అందుబాటులో ఉన్నట్లు టిఎస్ ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News