Sunday, April 28, 2024

పుట్టపాక తేలియా రుమాలుకు ఖండాంతర ఖ్యాతి

- Advertisement -
- Advertisement -

జి-20 సదస్సులో మెరవనున్న తెలంగాణ చేనేత వస్త్రం

సహజ రంగులు దీని సొంతం
ఇప్పటికే అనేక దేశాలకు ఎగుమతి అవుతున్న రుమాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ చీరలు, సంస్కృతి ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ తయారయ్యే చీర లు అందరి మనసులను దోచేస్తున్నాయి. అయితే ఈసారి పుట్టపాక తేలియా రుమాలు ప్రపంచ ఖ్యాతి పొందనుంది. ఈనెల 8వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జీ-20 సదస్సులో భారతీయ హస్తకళల ప్రదర్శనలో భాగంగా పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రు మాలును ప్రదర్శించబోతున్నారు. మండే వేసవిలోనూ చల్లగా ఉండి, చలి కాలంలో వెచ్చగా ఉండే ఈ తేలియా రుమాలు తయారీ చాలా ప్ర త్యేకమైనది. ఈ రుమాలులో వాడే రంగులు అన్నీ ప్రకృతి సిద్ధమైనవే కావడం గమనార్హం. ఆముదపు పొట్టు కాలిస్తే వచ్చే బూడిదను, వృక్ష సంబం ధ రంగులతో పాటు ఆముదం లేదా నువ్వుల నూనెను సూర్యర్శి ద్వారా వేడైన నీటిలో కలిపి నూలును అందులో నానబెడతారు. అలా నానిన నూలును కనీసం 20 రోజుల పాటు రోజుకు రెండు పూటలా చేతులతో పిసుకుతారు. తర్వాత నూలను నీళ్లు లేకుండా పిండి ఆరబెడతారు.

అది బాగా ఆరిన తర్వాత మళ్లీ నీటిలో నానబెడతారు. ఇలా 20 రోజుల పాటు చేయడం ద్వారా ద్వారాల్లోకి నూనె ఇంకి రంగులు చక్కగా అంటుకుంటాయి. పటిక, కరక్కాయ, హీరాకాసుతో ఎరుపు రంగును తయారు చేస్తారు. అలాగే నీలం, పసుపు, ఆకుపచ్చ వంటి రంగులను ఇతర చెట్ల నుంచి తయారు చేస్తారు. నూనెలు, సహజసిద్ధ రంగులు వాడడం మూలంగా తేలియా రుమాలు కు ఔషధ గుణాలు అందుతాయి. కాబట్టి వేసవి తాపం తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే గల్ఫ్ ప్రాంతాల్లో ఉండేవా రు ప్రత్యేకంగా తేలియా రుమాలును కొనుగోలు చేస్తుంటారు. ఈ రుమా లు డిజైన్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. పుట్టపాక తేలియా రుమాలు ఇక్కడి నుం చి ముంబయి, జర్మనీ, జపాన్, సింగపూర్, చైన్నై, నెదర్లాండ్, గుజరాత్, సోలాపూర్, కోల్‌క తా, అతరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి భార్యకు దుబీయన్ చీర బహుకరణ
దుబీయన్ వస్త్రం డిజైన్ పుట్టపాక చేనేత కళాకారు ల సొంతం. ప్రపంచ వ్యాప్రంగా దుబీయన్ వస్త్రం డిజైన్ ఎక్కడ కూడా కనిపించదు. పుట్టపాక చేనేత కళాకారులు మాత్రమే ఈ వస్త్రం డిజైన్ చేస్తారు. ఈ వస్త్రం తయారీలో నిలువు ఇక్కత్ విధానం పాటిస్తారు. అలాగే డిజైన్ కూడా నిలువు ఇక్కత్ లో నే రూపొందిస్తారు. ఈ వస్త్రం తయారీలో వాడే దారా లు పలుచగా ఉంటాయి. ఈ వస్త్రంతో ఫ్యా బిక్ దు స్తులు తయారు చేస్తారు. ఇటీవల భారత ప్రధాని న రేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో భాగం గా ఆ దేశ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టే మెక్రాన్‌కు దు బీయన్ చీ రను బహుకరించారు. ఇలా పుట్టపాక దుబీయన్ చీర ఖ్యాతి ఖండాంతరాలకు దాటిం ది. ఇప్పుడు తే లియా రుమాలును జీ-20 సదస్సు లో ప్రదర్శించ డం తమకు చాలా సంతోషాన్ని కల్గజేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News