- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులు ఆపితే తాము ఆపుతామని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రక్తతల నేపథ్యంలో తాము తగ్గింపునకు సిద్ధంగా ఉన్నామని, భారత్ దాడులు ఆపితే తాము తగ్గుతామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశామని వివరించారు.
భారత్ సరిహద్దుల్లో పాక్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని భారత సైన్యం వెల్లడించింది. అమృత్ సర్ ఖాసా కంటోన్మెంట్‌పైకి పాక్ డ్రోన్‌లు ప్రయోగించిందని, పాక్ డ్రోన్లను వచ్చినవి వచ్చినట్లు సమర్థంగా కూల్చివేశామని స్పష్టం చేసింది. సాధారణ పౌరులపై దాడులు ఆమోదనీయం కాదని పేర్కొంది. ఎలాంటి దాడులనైనా భారత సైన్యం దీటుగా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉందని బదులిచ్చింది.
- Advertisement -