Sunday, October 6, 2024

కేజ్రీవాల్‌ను గెలిపించకుంటే ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి: అతిషి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం రాకుండా,  విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉండాలంటే అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కాబోయే ముఖ్యమంత్రి అతిషి అన్నారు. కాగా రానున్న నాలుగు నెలల పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా తాను చూసుకుంటానన్నారు.

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా విద్యుత్ ఛార్జీలు ఉన్నాయన్నారు. కేజ్రీవాల్‌ను ఎన్నుకోవడం ద్వారా ఢిల్లీలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలను నివారించవచ్చన్నారు. కేజ్రీవాల్‌ను ఎన్నుకోకపోతే యూపీలో చోటు చేసుకున్న పరిస్థితులే ఇక్కడా సంభవిస్తాయన్నారు.

బిజెపి అధికారంలో ఉన్నయూపీలో రోజుకు 8 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు. ఈ విద్యుత్ కోతలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కాదని, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్‌లలో విధిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News