- Advertisement -
సికింద్రాబాద్: హైదరాబాద్ లోని బేగంపేటలోని పోలీస్ స్టేషన్‌కు సమీపంలో నాలాపై ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సిఇఒ మధుకర్ నాయక్ గురువారం నాలాను పరిశీలించారు. నాలాకు ఇరువైపుల అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం హైడ్రా అధికారులు నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో హైడ్రాను స్థానికులు ప్రశంసిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించి నాలాను వెడల్పు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Advertisement -