Saturday, September 23, 2023

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్ : ప్రభుత్వ భూమిని ఆక్రమించడంలో కబ్జాదారులు నూతన ఆలోచనలతో అధికారులకు వచ్చేలోపు గృహ ప్రవేశం చేసి దర్జాగా కో ట్లు దండుకుంటున్నారు.. వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి మండల పరిధిలోని బో డుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నంబర్ 63/1 కొండపోచమ్మ దేవా ల యం పక్కన పాశం మల్లేష్ అనే వ్యక్తి కోర్టు ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రాత్రికి రాత్రే నిర్మాణం చేపట్టారు. దీనిని అధికారులు కూల్చకుండా అనారోగ్యంతో ఉన్నా పండు ముసలమ్మ తీసుకొచ్చి అందులో పడుకోబెట్టారు. గమనించిన యాదవ సంఘం సభ్యులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయ డంతో స్పందించిన ఆర్.ఐ సునిత ఆక్రమించి నిర్మించిన ఇంటిని పరిశీలించి అందులోని ముసలమ్మను పోలీసుల సహకారంతో ఇంటికి పంపించి కూల్చివేశారు.

మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఎవరైనా అధికారం బలంతో ఆక్రమించిన చట్టపరమైన చర్యలు చే పడుతామని హెచ్చరించారు. కోర్టులను తప్పుదోవ పట్టించి కోర్టు ఆర్డర్ తీసు కొచ్చి ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని సమాచారం వస్తుందని, అలాంటి వాటిలో కోర్టు ఆర్డర్‌లను పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుం టామన్నారు. మండల పరిధిలోని ప్రభుత్వ స్థలాలపై మా అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News