Saturday, August 16, 2025

అంగట్లో అమ్మతనం.. అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

కొడుకు సహకారంతో తల్లి దందా
ఏడుగురు మహిళలు, పురుషుడు అరెస్ట్
మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి వెల్లడించిన షాకింగ్ నిజాలు

మనతెలంగాణ/పేట్ బషీరాబాద్: అమ్మతనాన్ని అంగట్లో పెట్టేశారు దుర్మార్గులు.. బిడ్డలను కని ఇవ్వడాన్ని బిజినెస్‌గా మార్చేశారు. అమ్మని అడ్డంగా పెట్టి లక్షలు దోచేస్తున్నారు. బిడ్డని కనిస్తే ఒక రేటు, బిడ్డ కావాలంటే మరో రేటు అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపి వారి రక్త మాంసాలను వెలకట్టి అమ్మేస్తున్న గ్యాంగ్ దారుణాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసీ పేరుతో పసికందులను విక్రయిస్తున్న ముఠా ను పేట్ బషీరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు, ఆరోగ్య శా ఖ బృందాలు అరెస్టు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిట ల్ ఉదంతంతో నగరంలో నకిలీ ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు.

పేట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో డిసిపి కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటకు చెం దిన లక్ష్మిరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి సు చిత్ర, పద్మానగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ అక్రమంగా సరోగసీ ఎగ్ ట్రేడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నా రు. వివిధ రాష్ట్రాల నుండి పిల్లలు లేని మహిళలను తీసుకువచ్చి, తన ఇంట్లో ఉంచి సరోగసీ ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చేలా చేసి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన నరేందర్ రెడ్డి, తల్లికి తోడుగా ఈ అక్రమ క్లినిక్ నడపడంలో సహకరించాడు.

లక్ష్మి రెడ్డికి గతంలోనే ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో, మాదాపూర్‌కు చెందిన హెగ్డే, లక్స్ ఆసుపత్రులతో సంబంధాలు పెంచుకుని ఈ రహస్య క్లినిక్‌ను నడిపినట్లు వైద్యారోగ్య శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నిందితులైన తల్లి కొడుకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6.47 లక్షల నగదు లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, 5 స్మార్ట్‌ఫోన్లు, కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, బిఎన్‌ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులకు సహకరించిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన మేడ్చల్ ఎస్‌ఓటి పోలీసులను, పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ సిబ్బందిని డిసిపి కోటిరెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News