Saturday, May 4, 2024

ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు జిల్లాలకు రాబోయే రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలు కాకుండా, లాహౌల్, స్పితి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

“చంబా, కాంగ్రా, కులు, మండి, ఉనా, హమీర్‌పూర్, బిలాస్‌పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది” అని ఐఎమ్ డి డిప్యూటీ డైరెక్టర్ బుయ్ లాల్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాకాలం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడం, కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. జాతీయ రహదారిపై సిద్ధార్థ ఫ్యాక్టరీ సమీపంలో ఖేరా జిల్లాలో చెట్టు కూలిపోవడంతో రహదారిని దిగ్బంధించినట్లు హెచ్‌పి పోలీసులు శనివారం తెలిపారు.

మన్‌పురా, నలాగఢ్‌లను కలిపే రహదారిపై సుదీర్ఘంగా ట్రాఫిక్ జామ్ అయింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్టు కూలింది. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల దాటికి పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వర్షాల కారణంగా రూ. 362 కోట్లు నష్టం వాటిల్లినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News