Friday, March 29, 2024

దేశానికి ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు అమలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సంక్షేమ సంబరాలలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయని విధంగా రైతుబంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ పథకం, చేపల పెంపకం వంటి అనేక పథకాలు మరే రాష్ట్రంలో అమలు చేయకపోయినప్పటికి ప్రజల కోసం సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం ఉందని ఇండ్లు ఉండదని, పుట్టిన పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ లబ్ధ్ది చేకూర్చడం జరుగుతుందన్నారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెలే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలస్తుందని, ఆడపిల్ల పెండ్లి సహాయం క్రింద లక్షా 116 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందిస్తున్నామని అన్నారు. ఒంటరి మహిళలకు, డయాలసిస్ పేషెంట్లకు, బిడి కార్మికులకు పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వృద్ధ్దుల పెన్షన్ వయస్సు 57కు తగ్గించామని అన్నారు.

ఎస్‌సి, ఎస్‌టి ప్రజలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, 9 సంవత్సరాలలో జరిగిన మార్పును అందరూ గుర్తించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సౌకర్యాలపై గ్రామాల్లో చర్చ జరపాలని ఆయన తెలిపారు. అనంతరం రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద 18 యూనిట్లు, బిసి కులవృత్తులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకట్రాణి సిద్దు, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ శోభ, డిఆర్‌డిఓ పిడి పురుషోత్తం, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, మహిళలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News