Wednesday, May 15, 2024

రెండు మూడు నెలల్లో రూ.56 వేలకు బంగారం

- Advertisement -
- Advertisement -

In India, the price of gold will reach 56 thousand

న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.090 పెరిగి రూ.52,040కు చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలో పయనించింది. కిలో వెండి ధర రూ.2100 పెరిగి రూ.72,100కు చేరింది. ఇతర నగరాల్లో ఇదే స్థాయిలో పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,935 డాలర్లకు చేరుకుంది. మరోవైపు వెండి ఔన్స్ 25 డాలర్లకి చేరుకుంది. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం పెరిగిందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) అనూజ్ గుప్తా అన్నారు. రెండు, మూడు నెలల్లో బంగారం రూ.56 వేలకు చేరుకోవచ్చని ఆయన అన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదు. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో వచ్చే 2-, 3 నెలల్లో బంగారం 2100 డాలర్ల స్థాయికి చేరుకుంటుందని, దీంతో భారత్‌లో బంగారం 56 వేలకు చేరొచ్చని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News