Monday, June 17, 2024

ఐటీ దాడులు.. రూ.26కోట్ల నగదు, రూ.90కోట్ల విలువైన ఆస్తి పత్రాలు సీజ్

- Advertisement -
- Advertisement -

నాసిక్‌లోని సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని లావాదేవీలకు ప్రతిస్పందనగా ఆదాయపు పన్ను శాఖ దాడులు ప్రారంభించింది. ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో దాదాపు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

నాసిక్‌లోని కెనడా కార్నర్‌లో ఉన్న సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని లావాదేవీలకు ప్రతిస్పందనగా ఆదాయపు పన్ను శాఖ దాడులు ప్రారంభించింది. శుక్రవారం నిర్వహించిన ఆపరేషన్‌లో యజమాని నివాసంతోపాటు అతని నిర్మాణ సంస్థ మహాలక్ష్మి బిల్డర్స్ లో కూడా సోదాలు చేపట్టింది.

తెల్లవారుజామున ప్రారంభమైన ఐటీ శాఖ నగల దుకాణం, యజమాని ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. శనివారం కూడా ఐటీ అధికారుల బృందాలు రోజంతా ఆర్థిక రికార్డులు, లావాదేవీల డేటా, సంబంధిత డాక్యుమెంటేషన్‌ను నిశితంగా పరిశీలించాయి. తాత్కాలికంగా అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాల్లో ఏదైనా వ్యత్యాసాలు లేదా దాచిన లావాదేవీలను వెలికితీసేందుకు అధికారులు సురానా జ్యువెలర్స్, మహాలక్ష్మి బిల్డర్స్ రెండింటి రికార్డులను నిశితంగా సోదాలు చేసింది. ఈ దాడుల్లో భారీగా నగదు, లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News