Sunday, December 15, 2024

భారత్ ఆగ్రహంతో దిగివచ్చిన కెనడా

- Advertisement -
- Advertisement -

దినపత్రిక కథనాలు ఊహాజనితం
కొట్టిపడేసిన ట్రూడో ప్రభుత్వం
నిజ్జర్ హత్య ప్రణాళిక మోడీ, జైశంకర్, దోవల్‌కు తెలుసని కెనడా పత్రిక కథనం
భారత్ ఆగ్రహంతో వివరణ ఇచ్చుకున్న కెనడా ప్రభుత్వం
నిజ్జర్ హత్య సహా మరే నేర చర్యల్లోను వారి ప్రమేయం లేదని స్పష్టీకరణ

ఒట్టావా : ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు సహా మరే నేర చర్యల్లోను భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ దేశ అత్యున్నత అధికారులకు సంబంధం ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలూ లేవని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ ప్రధాని మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే నిజ్జర్‌హత్య జరిగిందని జాతీయ భద్రత అధికారిని ఉటంకిస్తూ కెనడా దినపత్రిక ఒకటి కథనం రాసుకువచ్చింది. మోడీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్‌కు నిజ్జర్‌హత్య ప్రణాళిక గురించి సమాచారం ఉందని ఆ పత్రిక పేర్కొన్నది. ఆ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా ఇదే విషయమై కెనడా ప్రభుత్వం స్పందించింది. వార్తా కథనాన్ని సమర్థించేలా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నేరుగా ఎటువంటి ఆధారాలూ లేవని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబర్ 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సిఎంపి) దళం, అధికారులు కెనడాలో అసాధారణ చర్య తీసుకున్నారని, భారత ఏజెంట్లు పాల్పడుతున్ప నేర కార్యకలాపాలపై బహిరంగ ఆరోపణలు చేశారని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యకలాపాలకు సంబంధించి భారత్ ప్రధాని మోడీ, మంత్రి జైశంకర్, ఎన్‌ఎస్‌ఎ దోవల్‌కు కానీ ప్రమేయబ ఉన్నట్లు కెనడా ఎప్పుడూ చెప్పలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనికి విరుద్ధంగా ఎటువంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహాజనితమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరుడు జరిగిన నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోడీ హస్తం ఉందని కెనడా దినపత్రిక ‘లుడిక్రస్’ ప్రచురించిన కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగివచ్చిన కెనడా ఈ ప్రకటన చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News