Sunday, September 7, 2025

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

- Advertisement -
- Advertisement -

దక్షిణ కొరియా: ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో (World Archery Championship) భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. మెన్స్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణపతాకం లభించింది. టోర్నమెంట్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను 235-233 తేడాతో ఓడించిన భారత్ పురుషుల జట్టు టైటిల్‌ని సొంతం చేసుకుంది. రిషబ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేష్‌ల త్రయం ఈ ఘనతను సాధించింది. మూడు సెట్లు ముగిసేసరికి ఇరు జట్లు 176-176తో సామానమైన స్కోర్‌లో ఉన్నాయి. దీంతో నిర్వహించిన టై బ్రేక్‌లో భారత జట్టు కీలకమైన 59 పాయింట్లను సాధించింది. ఇదే పోరులో ఫ్రెంచ్ జట్టు కేవలం 57 పాయింట్లకు మాత్రమే పరితమైంది. దీంతో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది.

ఇది ఈ ఛాంపియన్‌షిప్‌లో (World Archery Championship) భారత్‌కు రెండో మెడల్. మిక్స్‌డ్ కాంపౌండ్ ఫైనల్‌లో రిషబ్ యాదవ్, జ్యోతి సురేఖ వెన్నంల జోడీ నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో తృటిలో స్వర్ణ పతకం చేజార్చుకున్నారు. ఈ జోడి తొలి సెట్‌లో ఆధిక్యం సాధించింది. కానీ, ఆ తర్వాత సబ్‌-పార్ సెట్‌లో నెదర్లాండ్స్ 37 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన మూడు సెట్లు వారు ఓడిపోలేదు.

Also Read : హాకీ ఆసియాకప్ ఫైనల్ కు భారత్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News