Monday, April 29, 2024

సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Nrendra Modi

న్యూఢిల్లీ:  భారతదేశం సౌర, అంతరిక్ష రంగాలు “అద్భుతాలు చేస్తున్నాయని”  ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు, వాటి విజయాలను చూసి ప్రపంచం మొత్తం “ఆశ్చర్యపోతోంది” అని అన్నారు. ప్రధాని మోడీ తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం అన్నది మన యువత దేశానికి ఇచ్చిన “ప్రత్యేక దీపావళి బహుమతి”గా అభివర్ణించారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవడం వల్ల చాలా మంది యువ స్టార్టప్‌లు అందులో చేరడానికి దారితీసిందని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు.

“భారతీయ పరిశ్రమలు , స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు మరియు కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయి. ముఖ్యంగా, IN-SPAce సహకారం ఈ ప్రాంతంలో పెద్ద మార్పును తీసుకురానుంది.” ఈ సందర్భంలో, ప్రధాని కూడా విద్యార్థుల శక్తిని కొనియాడారు, దీనిని కేవలం విద్యార్థి యూనియన్ రాజకీయాల కోణంలో ఆలోచించవద్దని అన్నారు.

భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి విద్యార్థి శక్తియే ప్రాతిపదిక అన్నారు. “ యువత హ్యాకథాన్‌లలో సమస్యలను పరిష్కరించడం,  రాత్రంతా మేల్కొని గంటల తరబడి పని చేయడం చాలా స్ఫూర్తిదాయకం. దేశంలోని లక్షలాది మంది యువత ఏకతాటిపైకి రావడంతో ఇటీవలి సంవత్సరాలలో నిర్వహించిన హ్యాకథాన్ అనేక సవాళ్లను పరిష్కరించింది,కొత్త పరిష్కారాలను అందించింది.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, సెమీకండక్టర్లు మరియు 5జి కమ్యూనికేషన్‌ల ఇతివృత్తాలను స్పృశించినట్లు ఆయన వాటిలో కొన్ని వివరాలను ఉదహరించారు. అనేక ఐఐటీలు కూడా స్థానిక భాషలను నేర్చుకోవడాన్ని సులభతరం చేసే బహుళ భాషా ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తున్నాయని, జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించడంలో ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News