Wednesday, April 30, 2025

కెనడా దౌత్యవేత్తపై భారత్ బహిష్కరణ వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్తపై కెనడా ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో ఇందుకు ప్రతీకారంగా భారత్‌లోని కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ కెనడా హైకమిషన్‌కు తెలియచేసింది.

భారత్‌లోని కెనడా హై కమిషనర్‌ను పిలిపించుకున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక సీనియర్ కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం తెలియచేశారు. తమ ఆంతరంగిక వ్యవహారాలలో కెనడా దౌత్యవేత్తల జోకాన్ని నరిసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వం కెనడా హై కమిషనర్‌కు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News