Monday, September 25, 2023

విభజన వేళ తెలంగాణలో కానరాని సంబరాలు: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయిల దార్శనికతను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అదే సమయంలో మన్మోహన సింగ్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఓటుకు నోటు కుంభకోణాన్ని గురించి కూడా ప్రధాని మోడీ లోక్‌సభకు గుర్తు చేశారు.

75 సంత్సరాల పార్లమెంటరీ ప్రయాణంపై సోమవారం లోక్‌సభలో చర్చను ప్రారంభించిన మోడీ ఇప్పటి వరకు దేశం సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపాలు, గుణపాఠాలను ప్రస్తావించారు. వాజపేయి హయాంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి మూడు రాష్ట్రాలు ఏర్పడినపుడు ప్రజలు సంబరాలు చేసుకున్నారని, కాని కాంగ్రెస్ పాలనలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించినపుడు రెండు రాష్ట్రాలలో రక్తపాతం, విద్వేషం ఏర్పడ్డాయని మోడీ అన్నారు.

ఇదే పార్లమెంట్‌లో అర్ధరాత్రి లభించిన స్వాంత్య్రం గురించి తొలి ప్రధాని నెహ్రూ మాట్లాడారని, ఆయన మాటలు ఇప్పటికీ స్ఫుర్తినిస్తూనే ఉన్నాయని మోడీ అన్నారు. ఈ 75 సంవత్సరాలలో అన్నిటికన్నా గొప్ప విజయం సామాన్య ప్రజలకు దేశ పార్లమెంట్‌పై విశ్వాసం పెరగడమేనని ఆయన తెలిపారు. కొత్త భవనంలోకి పార్లమెంట్ మారిన తర్వాత కొత్త ఆశలు, విశ్వాసం ఉదయిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News