Wednesday, October 4, 2023

దివ్యాంగురాలి గొంతునులిమి… అడవిలో చెట్టుకు వేలాడదీసి

- Advertisement -
- Advertisement -

జైపూర్: దివ్యాంగురాలి గొంతునులిమి హత్య చేసి అనంతరం అడవిలో చెట్టుకు ఉరేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దేవ్‌గఢ్ ప్రాంతం కుంతాగడ్ గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో దివ్యాంగురాలు చెట్టుకు ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి అమిత్ కుమార్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కోడలు కనిపించడంలేదని మేనమామ ధమోతర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని ఆమె ఉరేసుకున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. తన కోడలు అని సమాధానం రావడంతో వెంటనే పోలీసులు ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా కుల్దీప్ గెహ్లాట్ అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమెను కుల్దీప్ బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడు. స్కార్ఫ్‌తో ఆమెకు ఉరేసి చెట్టుకు వెలాడదీశాడు. అక్కడి నుంచి పారిపోయానని వివరణ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: తల్లిని చంపి బిడ్డను తీసారు… తెలంగాణను పగబట్టిన మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News