Thursday, October 10, 2024

తగినన్ని ఉద్యోగాలు కల్పించడం లేదు: రఘురామ్ రాజన్

- Advertisement -
- Advertisement -

భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్ బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వృద్ధి 7 శాతం ఉన్నప్పటికీ ఇండియా తగినన్ని ఉద్యోగాలు కల్పించడం లేదని గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఖాళీలు దీనిని ప్రతింబింబిస్తున్నాయన్నారు. ఆయన ఆదివారం పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.

భారత ఆర్థిక వృద్ధి 7 శాతం ఉందని అన్నప్పుడు దానికి ఆయన జవాబిస్తూ ‘‘అది దురదృష్టకరమైనది…7 శాతం ఆర్థిక వృద్ధి అనంగానే, చాలా ఉద్యోగాలు సృష్టిస్తున్నామని మీరనుకుంటుండవచ్చు. కానీ మీరు మన వస్తు తయారీ వృద్ధి చూస్తే అది చాలా వరకు క్యాపిటల్ ఇంటెన్సివ్ అని అర్థం కాగలదు’ అన్నారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వం లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ పై దృష్టి పెట్టాలని సూచించారు.

భారతీయుల్లో మంచి ఆదాయం ఉన్నవారు సౌక్యంగా ఉన్నారు. అల్పాదాయం వారి వినియోగ వృద్ధి ఇప్పటికీ ప్రీ-ప్యాండమిక్(కోవిడ్ కాలం నాటి) స్థాయి నుంచి ఇంకా తేరుకోలేదనే అనిపిస్తోందన్నారు. రాజన్ ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో ఆర్థిక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మీడియా టర్మ్ లో భారత ఆర్థిక వృద్ధి 6 నుంచి 7 శాతం మేరకే ఉండనుందన్నారు. వియత్నాం, బంగ్లాదేశ్ లను ఉదాహరిస్తూ ‘మనం లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ’ ని గమనించాలి. మనం దాన్ని వదిలేయకూడదు’ అన్నారు. భారత్ కు 15 ఏళ్ల షార్ట్ స్పాన్(అల్ప సమయం) ఉందని, ఈ లోగా డేమోగ్రఫిక్ డివిడెండ్ పొందాలని అన్నారు. జిఎస్ టి హేతుబద్దీకరణ గురించి కూడా రాజన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News