Saturday, April 20, 2024

రెండోసారి రికార్డు స్థాయిలో జిఎస్‌టి వసూళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు రెండోసారి రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. గతేడాది మార్చితో పోలిస్తే జిఎస్‌టి వసూళ్లులో 13శాతం వృద్ధి నమోదైంది. అదేవిధంగా జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు రూ.160లక్షలు దాటడం ఇది రెండోసారి. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చిలో మొత్తం రూ.1,60,122కోట్లు జిఎస్‌టి వసూలైంది. దీనిలో సెంట్రల్ జిఎస్‌టి స్టేట్ జిఎస్‌టి ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి ఆర్థికశాఖ పేర్కొంది.

వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన ట్యాక్స్ రూ.10,355కోట్లుతో కలిపి ఐజిఎస్‌టి మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 202223 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.18.10లక్షల కోట్లు జిఎస్‌టి వసూలైంది. 202122తో పోలిస్తే వసూళ్లు 22శాతం అధికంగా ఆర్థికశాఖ వెల్లడించింది. ఏడాది మొత్తం పరిశీలిస్తే సగటున రూ.1.51లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. మార్చి నెలలో సెస్సుల రూపంలో రూ.10,355కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా జిఎస్‌టి మొదలైన తరువాత ఇప్పటివరకూ రెండు పర్యాయాలు మాత్రమే వసూళ్లు రూ.1.6లక్షల కోట్లు దాటాయి.

అయితే ఓ ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున రూ.1.5లక్షల కోట్లు మార్కును దాటడం ఇది నాలుగోసారి అని గణాంకాలు తెలుపుతున్నాయి. గతేడాది ఏప్రిల్ మాసంలో జిఎస్‌టి రికార్డు స్థాయిలో రూ.1.68లక్షల కోట్లు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News