Saturday, December 14, 2024

దేశంలో కొత్తగా 6 కొవిడ్ మరణాలు

- Advertisement -
- Advertisement -

కొత్త కొవిడ్ కేసులు 290
క్రియాశీలక కేసుల సంఖ్య 2059

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 290 కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. కొవిడ్‌తో క్రియాశీలక కేసుల సంఖ్య 2059 అని మంత్రిత్వశాఖ తెలియజేసింది. గడచిన 24 గంటలలో దేశంలో కొత్తగా ఆరు మరణాలు నమోదు అయ్యాయని, వాటిలో నాలుగు మరణాలు కేరళలో సంభవించగా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లలో చెరి ఒక మరణం నమోదు అయ్యాయని ఆదివారం ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన మంత్రిత్వశాఖ డేటా వెల్లడించింది.

రోజువారీ కేసుల సంఖ్య గత డిసెంబర్ 5 వరకు రెండు అంకెల స్థాయికి పడిపోయింది. కానీ కొత్త వేరియంట్, శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా వాటి సంఖ్య తిరిగి పెరగసాగింది. డిసెంబర్ 31 ఒక్క రోజులో 841 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా, మొత్తం క్రియాశీలక కేసులలో అధిక శాతం (సుమారు 92 శాతం) ఇంటిలోనే కోలుకుంటున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగ, మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో ఇంత వరకు 220.67 కోట్ల కొవిడ్ డోసులు ఇవ్వడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News