Monday, September 1, 2025

టారిఫ్‌ల వివాదం.. అమెరికాకు భారత్ షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా తెచ్చిన కొత్త నియమాల కారణంగా భారత్ అమెరికాకు మెయిల్ బుకింగ్స్‌లను ఆపేసింది. 100 డాలర్ల లోపు విలువ చేసే ఉత్తరాలు, డాక్యుమెంట్ల, కానుకలను బుక్‌చేయబోమని తపాలా సేవల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేసింది. 2020 జూలై 30 జారీచేసిన అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నం. 14324 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉత్తర్వు ఇదివరలో ఇచ్చిన 800 డాలర్ల మేరకు మినహాయింపును రద్దు చేసింది. జూలై 30న ట్రంప్ యంత్రంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 29వ తేదీ నుంచి 100 డాలర్లకుపైగా విలువున్న పార్శిళ్లపై అమెరికా కస్టమ్స్ సుంకాలు అమలులోకి వచ్చాయి. దీంతో అమెరికాకు పార్శిళ్ల బుకింగ్‌లను నిలిపేస్తున్నట్లు భారత తపాల శాఖ ప్రకటించింది. ఇదే కారణంతో ఇతర 25 దేశాలు కూడా అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News