Sunday, May 11, 2025

రేసులో గిల్, రాహుల్, బుమ్రా!

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రతిష్ఠాత్మకమై ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ తప్పుకోవడంతో టెస్టుల్లో టీమిండియాకు కొత్త కెప్టెన్ అనివార్యమయ్యాడు. ఈ సిరీస్ కోసం కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. రోహిత్ వారసుడిగా ఎవర్ని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో చాలా మందే ఉన్నారు. జస్‌ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌ల పేర్లు కెప్టెన్సీ రేసులో వినవస్తున్నాయి. ఈ నలుగురు మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాలో కొనసాగుతున్నారు.

ఐపిఎల్‌లో గిల్, పంత్‌లు కెప్టెన్లుగా మెరుగైన ప్రతిభను కనబరిచారు. రాహుల్ కూడా ఢిల్లీ టీమ్‌కు అనధికార కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఉన్నా రాహులే అన్ని తానై జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో రాహుల్‌కు కూడా సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా కూడా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. కానీ ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్న అతన్ని సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది సందేహమే. కొంత కాలంగా బుమ్రాను గాయాలు వెంటాడుతున్నాయి.

దీంతో చాలా రోజుల పాటు అతను ఆటకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇలాంటి స్థితిలో అతన్ని సారథిగా ఎంపిక చేసే సాహసం బిసిసిఐ చేస్తుందని భావించలేం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే శుభ్‌మన్‌కే కెప్టెన్సీ అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఐపిఎల్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గిల్ అద్భుత ప్రతిభను కనబరిచాడు. ఇప్పటికే వన్డేల్లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో గిల్‌కే కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉంది. రిషబ్ పంత్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ అతను బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేక పోతున్నాడు. ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే అతనికి టీమిండియాలో చోటు కష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. విషయాలన్నీ గమనిస్తే రోహిత్ వారసుడిగా గిల్‌కు ఎంపిక చేయడం ఖాయమనే చెప్పాలి. అయితే ఒకవేళ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే అతనికి కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News