Saturday, December 14, 2024

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ప్రోబా-3 మిషన్‌’ను ప్రయోగించనున్న భారత్

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: వచ్చే నెల ప్రారంభంలో శ్రీహరికోటలోని  స్పేస్‌పోర్ట్  నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ప్రోబా-3’ మిషన్‌ను భారత్ ప్రయోగించనుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ఇక్కడ తెలిపారు. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ప్రోబా-3 మిషన్‌లో భాగమైన రెండు ఉపగ్రహాలను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి)తో అనుసంధానం చేసేందుకు మంగళవారం ఉదయం శ్రీహరికోటకు తీసుకువచ్చినట్లు సింగ్ తెలిపారు.

“యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా-3 మిషన్ డిసెంబర్ మొదటి వారంలో శ్రీహరికోట నుండి పిఎస్ఎల్వి  రాకెట్ ద్వారా ప్రయోగించబడుతుంది” అని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ నిర్వహించిన ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్‌లో సింగ్ తెలిపారు. డిసెంబర్ 4న ఈ మిషన్‌ను చేపట్టే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News